సీలేరు నదీ తీర ప్రాంతాలైన ఆంధ్రా, ఒడిసా ప్రాంతాల్లో పుష్ప-2 సినిమా సందడి ప్రారంభమైంది. చిత్రీకరణకు సెట్టింగ్లు వేస్తున్నారు. ఎర్ర చందనం దుంగలను పోలిన ఆర్టికల్స్ మల్కాన్గిరి జిల్లాకు చేరుకున్నాయి. మల్కాన్గిరి జిల్లాలో ఎర్రచందన దుంగల తయారీ పనులు జరుగుతున్నాయి. చిట్టికొండ స్వావిమాన్, పొల్లూరు, మోతుగూడెం ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తారు. దర్శకుడు సుకుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.ప్రసాద్, కెమెరామన్ క్యూబాతో పాటు మైత్రీ మూవీస్ ప్రతినిధులు మల్కాన్గిరి, మోతూగూడెం ప్రాంతాల్లో పర్యటించి చిత్రీకరణ ప్రదేశాలను గుర్తిస్తున్నారు.