ఏపీలో నేటి నుంచి ‘‘జగనన్నకు చెబుదాం’’ అంటూ ఓ కొత్త కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఈ పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఫోన్‌కాల్‌లో ఫిర్యాదు నేరుగా జగన్ తీసుకుంటారని.. లేదా ఆయన వద్దకు వెళతాయని నిన్నటి వరకూ పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ఉన్న సీఎం కనెక్ట్‌ను జగన్ కాపీ కొట్టినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.