రాష్ట్రంలో గతేడాది ప్రారంభించిన హైస్కూల్ ప్లస్‌లలో ఇంటర్ పాఠ్యాంశాల బోధన కోసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లను నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 294 హైస్కూల్ ప్లస్‌లలో 1,746 మంది పీజీటీలు అవసరమని గుర్తించింది. ఆ పోస్టుల్లో సీనియర్ స్కూల్ అసిస్టెంట్ల(ఎ్‌సఏ)ను నియమించేందుకు సీనియారిటీ జాబితాలను పంపాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అంగీకరించిన స్కూల్ అసిస్టెంట్లకు ఓ పరీక్ష నిర్వహించి సమర్థతను అంచనా వేస్తామని తెలిపింది. పీజీటీలుగా నియమించే ఎస్‌ఏలకు ఒక ఇంక్రిమెంట్ వస్తుందని, భవిష్యత్తులో న్యాయ వివాదాలు రాకుండా వారి సీనియారిటీ అలాగే ఉంటుందని వివరించింది. సబ్జెక్టుల వారీగా తెలుగుకు 253 మంది, ఇంగ్లి్‌షకు 253 మంది, గణితానికి 196 మంది, ఫిజిక్స్‌కు 241 మంది, కెమిస్ర్టీకి 241 మంది, బోటనీకి 188 మంది, జువాలజీకి 188 మంది, సివిక్స్‌కు 62 మంది, ఎకనామిక్స్‌కు 62 మంది, కామర్స్‌కు 62 మంది పీజీటీలు అవసరమని తెలిపింది.