హైదరాబాద్ లోని వనస్థలిపురానికి చెందిన విజయ్ కుమార్ (38) సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈనెల 7న శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చాడు. తిరుపతి నగరం మంగళం రోడ్డులోని ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నాడు. రెండు రోజుల పాటు పూటుగా మద్యం సేవించి గదిలోనే ఉండిపోయాడు. అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది మంగళవారం రాత్రి మాస్టర్ కీతో తలుపు తీసి చూడగా మృతిచెంది ఉన్నాడు. అతిగా మద్యం సేవించి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.