బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర అడవి పర్యావరణ న్యాయ దేవాయ శాఖ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు బుధవారం నాడు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు.