అవుకు మండల పరిధిలోని చనుగొండ్ల గ్రామంలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్య క్రమం నిర్వహిస్తున్నట్లు అవుకు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరవుతారన్నారు.