చిప్పగిరి మండల కేంద్రమైన చిప్పగిరిలో వెలసిన బం బం స్వామి ఉరుసు మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం వేకువ జామున దర్గా పీఠాధిపతి సయ్యద్ ఆరిపదీన్ ఖాద్రి ఆధ్వర్యంలో స్వామి వారి ప్రతిమను అశ్వంపై ప్రతిష్టించి గ్రామంలోని పురవీధుల గుండా మేళ తాళాలతో స్వామివారిని ఊరేగింపు నిర్వహిం చారు. మొక్కుబడుల ఉన్నవారు పురుషులు, మహిళలు పొర్లు దండాలు పెడుతూ మొక్కుబడి చెల్లించుకున్నారు. స్వాములవారు ఊరేగింపులో తెలుగు రాష్ట్రాల నుంచే గాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అనేకమంది భక్తాదులు వచ్చి మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్గా దగ్గర వచ్చిన భక్తులందరికీ కూడా కనీస సౌకర్యా లను కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. మండ లంలోని పలువురు ప్రజా ప్రతినిధులు స్వాముల వారినీ దర్శించుకుని కాయ కర్పూరం అర్పించారు.