గాజువాకలో 10 ఎంజిడి నీటి పథకం పైప్ లైన్ నిర్వహణ పనులు కారణంగా ఈ నెల 11న పలు చోట్ల నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఏఈ కేదార్నాధ్ మంగళవారం తెలిపారు. జీవీఎంసీ 70, 64, 74 వార్డులలోని కొన్ని కాలనీలో నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ మేరకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీరు అందించే ఏర్పాటు చేస్తామన్నారు.