నేత్రదానంతో మరొక్కరికి కంటి వెలుగు ప్రసాదించడమేనని లయన్స్ క్లబ్ అధ్యక్షులు సింగంశెట్టి ఆదినారాయణ రావు అన్నారు. మండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామంలో మంగళవారం పొట్లూరి నరసింహారావు మృతి చెందడంతో తడిగడప ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వారు నేత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం మృతిచెందిన మనం దానం చేసిన నేత్రాలు మరొకరికి కంటి వెలుగుని ప్రసాదిస్తాయని ఆయన వెల్లడించారు. అన్ని దానాల కన్నా నేత్రదానం అనేది చాలా గొప్పదన్నారు. మనం మృతి చెందిన అనంతరం మన నేత్రాలు మరొకరి ద్వారా చూస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వైపిసి ప్రసాద్, ఏ వీరభద్రరావు, సూరపనేని పరంధామయ్య, ఎం శ్రీహరి, పొట్లూరి రవికుమార్, డి రామకృష్ణ, పాల్గొన్నారు.