డోన్ పట్టణంలోని త్రివర్ణ కాలనీలో నివాసముంటున్న ట్రాన్స్‌జెండర్ సాయి పల్లవి అలియాస్ సాయినాథరెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. నాలుగేళ్లుగా తోటి హిజ్రాలతో ఇంట్లో నివాసముంటున్న సాయిపల్లవి కొద్ది రోజుల నుంచి తీవ్ర మనస్తాపంతో ఉంది. ట్రాన్స్‌జెండర్‌గా మారిన సాయిపల్లవిని తల్లిదండ్రులు దగ్గరకు చేర్చుకోక పోవడంతో మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో సాయిపల్లవి ఆత్మహత్య చేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు.