అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు బయటకు మంగళవారం పారామిలిటరీ రేంజర్లు అరెస్టుతో దేశవ్యాప్తంగా విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలతో పాక్ అట్టుడుకుతోంది. ఆర్మీ ప్రధాన కార్యాలయంపైనా ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పంజాబ్ ప్రావిన్సుల్లో పలుచోట్ల 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చారు. ముందుజాగ్రత్తగా కొన్నిచోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
పాక్‌లో నెలకున్న అస్థిర పరిస్థితుల కారణంగా అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడాలు తమ పౌరులు, దౌత్య సిబ్బందికి ట్రావెల్ అడ్వైజరీ జారీచేశాయి. ట్రావెల్ అడ్వైజరీ జారీచేసి పాక్‌లోని అమెరికా ఎంబసీ.. ‘ఇస్లామాబాద్‌లోని ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు... పాక్ వ్యాప్తంగా నిరసలు జరుగుతున్నట్టు అందిన నివేదికలను అమెరికా రాయబార కార్యాలయం పరిశీలిస్తోంది’ అని పేర్కొంది. మరోవైపు, ఆందోళనలు, ఘర్షణల నేపథ్యంలో మే 10న వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేసింది. పాక్‌లోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, జనం ఎక్కువగా ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది.
‘వ్యక్తిగత భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. వ్యక్తిగత భద్రతా ప్రణాళికలను సమీక్షించాలి.. గుర్తింపు కార్డులను వెంట ఉంచుకోవాలి.., చట్టాన్ని అమలు చేసే వారి సూచనలు అనుసరించాలి.. పరిసరాల గురించి తెలుసుకోవడానికి అప్‌డేట్‌ల కోసం స్థానిక మీడియాను పర్యవేక్షించాలి’ ప్రజలను కోరింది.
యూకే ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ కూడా తన పౌరులకు కీలక సూచనలు చేసింది. రాజకీయ ప్రదర్శనలు, పెద్ద సంఖ్యలో గుమిగూడే ప్రాంతాలు, బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.. అవసరమైన విధంగా ప్రణాళికలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. స్థానిక మీడియాలో వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరింది.
‘పాకిస్థాన్‌లో బహిరంగ ప్రదర్శనలు సర్వసాధారణం.. మీరు స్థానిక వార్తలను అనుసరించాలి... నిరసనలు చిన్న హెచ్చరికతో సంభవించవచ్చు... చాలా వరకు శాంతియుతంగా ఉన్నప్పటికీ అవి హింసాత్మకంగా మారవచ్చు.. త్వరగా పెద్దవవుతాయి’ అని పేర్కొంది. అటు, కెనడా ప్రభుత్వం తన పౌరులను, దౌత్య సిబ్బందిని అప్రమత్తం చేసింది. అనూహ్యమైన భద్రతా పరిస్థితి కారణంగా పాకిస్థాన్‌లో అధిక స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఉగ్రవాదం, పౌర అశాంతి, మతపరమైన హింస, కిడ్నాప్‌ల ముప్పు ఉందని హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa