నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. చివరకు మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్ 35 పాయింట్ల స్వల్ప నష్టంతో, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో ముగిశాయి. నేటి సెషన్‌లో చాలా స్టాక్‌లు 5 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈలో జోంజువా ఓవర్సీస్ 13.80 శాతం, తంబోలి క్యాపిటల్ 13.31 శాతం, అద్విక్ క్యాపిటల్ 13.18 శాతం, ఇంటెగ్రా ఇంక్ 12.29 శాతం, గ్యాలప్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ 12.11 శాతం నష్టపోయాయి. నేటి సెషన్‌లోనూ టాప్ లూజర్‌లుగా నిలిచాయి. నిఫ్టీ 50లో 27 స్టాక్స్ లాభాల్లో ముగియగా, 23 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.