విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని పెదమేడపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొర నిర్వహించారు. శుక్రవారం గ్రామంలో ఇంటింటికీ వెళ్లిన రాజన్న దొర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ద్వారా ఇప్పటివరకు చేకూరిన లబ్ధిని లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వైస్ ఎంపీపీ సారికి ఈశ్వరరావు, వైయస్సార్ పార్టీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్, ఉపసర్పంచ్ పొడిపిరెడ్డి అప్పలనాయుడు, సర్పంచ్ బోనెల ప్రకాష్ అమ్మ, సచివాలయం కన్వీనర్ మరడ సింహాచలం,తహసిల్దార్ ఆదిబాబు, ఎంపీడీవో త్రివిక్రమ రావు, ఏపిఎం దేవుడు బాబు, హౌసింగ్ ఏఈ డేవిడ్, ఏపీవో, సీఐ లెంక అప్పలనాయుడు, ఎస్సై సిద్ధార్థ కుమార్, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.