ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు రాజమండ్రిలో అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. ఈ మహానాడుకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. 28న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించటం వల్ల ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. 27న రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు 1500 మంది ప్రతినిధులుతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 15న తీర్మానాలు చేస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నాలుగున్నరళ్ళ వైసీపీ పాలన దుర్మార్గంపై ప్రత్యేక తీర్మానం ఉంటుందని, 28న 15 లక్షల మంది హాజరవుతున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడు విజయవంతం కోసం 15 కమిటీలు ఏర్పాటుచేసుకున్నామన్నారు. దీనికి పోలీస్ యంత్రాంగం సహకరించాలని కోరారు. ఈ నెలఖారు వరకు టీడీపీకు హోర్డింగ్లు ఇవ్వకూడదని బెదిరిస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.