ప్రకాశం జిల్లా, తర్లుపాడుమండలంలోని జగన్నాథపురంలో గురువారం తెల్లవారు జామును అనుమానస్పద స్థితిలో వివాహిత మృతిచెందిన ఘటన చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్ళితే ... జగన్నాథపురానికి చెందిన ముక్కెర సాల్మాన్‌కు బేస్తవారిపేట మండలం మల్లాపురం గ్రామానికి చెందిన గ్రేస్‌కుమారి(20)తో ఆరు నెలల క్రితం వివాహమైంది. ఆమెకు కడుపులో నొప్పి వస్తుందని బుధవారం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. ఈమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. ఆమెకు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ.. గురువారం తెల్లవారిజామున మృతి చెందింది. గ్రేస్‌కుమారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తాడివారిపల్లె ఎస్ఐ వి.సుధాకర్ కేసు నమోదు చేశారు. తహసీల్దార్ వరకుమార్, వీఆర్వో రమారెడ్డి రిమ్స్ వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం గ్రేస్ కుమారి ఎలా మృతి చెందింది అనే దానిపై స్పష్టత వస్తుందని ఎస్ఐ తెలిపారు. పెళ్లైన 6 నెలలకే గ్రేస్‌కుమారి మృతి చెందడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు. భార్య భర్తల మధ్య గొడవల నేపథ్యంలో ఘర్షణ జరిగినట్లుగా పోలీసులు భావించి విచారిస్తున్నారు.