టొమోటో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుంటే సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కు పూనుకొంటామని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా ప్రకటించారు. శుక్రవారం మదనపల్లి టీడీపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ లక్షల రూపాయలు వెచ్చించి సాగు చేసిన టొమోటో కు గిట్టు బాటు లేకుండా రైతులు తీవ్ర మైన ఆందోళన లో వున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఆడుకోకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు పాల్గొన్నారు.