ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్టంలో రాజారెడ్డి రాజ్యాంగం నడవదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 04:08 PM

వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబరు 1ని హైకోర్టు కొట్టివేయడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. ఆయన దీనిపై ఒక ట్వీట్‌ చేశారు. ‘‘దేశంలో అంతిమంగా గెలిచేది, నిలిచేది అత్యున్నతమైన అంబేడ్కర్‌ రాజ్యాంగమే. జగన్‌ వంటి నాయకులు వస్తారని నాడే ఊహించి, ఆయన భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారు. ప్రజాస్వామమే ఉన్నతమైందని, అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని మరోసారి స్పష్టమైంది. ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై గొంతెత్తకుండా చేయాలన్న దురుద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఈ జీవోను తెచ్చింది. దానిని కోర్టు కొట్టివేయడం హర్షణీయం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్‌ మూర్ఖత్వానికి హైకోర్టు తీర్పుతో చెంప దెబ్బ తగిలిందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. హైకోర్టు కొట్టివేసిన జీవో ఆధారంగా ప్రజలు, ప్రతిపక్ష పార్టీలపై మోపిన తప్పుడు కేసులను ఎత్తేయాలని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa