ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 04:09 PM

ఏపీ హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప దెబ్బ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  అన్నారు. జీవో నెం.1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం తెచ్చిన నిరంకుశమైన జీవో నెం 1 ను హైకోర్టు కొట్టివేయడం శుభపరిణామమన్నారు. రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజలు రోడ్లపై నిరసన, పాదయాత్రలు, సభలు పెట్టకూడదని.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా నిరంకుశపాలన ఏపీలో సాగుతోందని.. అందుకు నిదర్శనమే జగన్ రెడ్డి తెచ్చిన జీవో నెంబర్ 1 అని అన్నారు. ఈ నిరంకుశ జీవోను కొట్టివేస్తూ హైకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిందని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa