ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంద రోజుల పాదయత్రకి సంఘీభావం తెలుపుతా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 04:16 PM

నారా లోకేష్ పాదయాత్ర  ఈనెల 15న వంద రోజులు పూర్తవుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యువగళానికి స్ఫూర్తి ఇచ్చేందుకు మైలవరం పట్టణంలో తాను పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. పాదయాత్రలో పార్టీ నాయకులందరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 1 రద్దు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రతి పక్షాలు గొంతుఎత్తడం హక్కన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవాలి కానీ రాజారెడ్డి రాజ్యాంగం కాదని అన్నారు. జీవీరావుకు రాజశేఖర్ రెడ్డి సత్కారం చేశారని, జగన్ రెడ్డి పేపర్‌లో ఎన్నో ఆర్టికల్స్ రాశారని తెలిపారు. వాస్తవాలు చెబితే బహిరంగ సభలో వ్వక్తిత్వాలు దెబ్బతిసే విధంగా మాట్లాడటం సబబు కాదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa