జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 1 పై హైకోర్టు తీర్పు చెప్పు తీసుకొని కొట్టినట్టు ఉందని నరసాపురం ఎంపీ రఘురామరాజు అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జీవో నెం.1 ప్రజల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమన్నారు. 5 నిమిషాల్లో కొట్టేయాల్సిన కేసు 5 నెలలు పెండింగ్‌లో ఉందని.. ఇప్పటికైనా ఆర్డర్ రావడం చాలా సంతోషమన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వచ్చి ఉంటే బాగుండునని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa