ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ లో కర్ణాటక గెలుపు జోష్... దేశవ్యాప్తంగా ప్రభావం చూపాలని యోచన

national |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 05:05 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం ముంగిట నిలిచింది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత రీతిలో ఫలితాలను సాధించింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3 గంటల సమయానికి 131 స్థానాలు చేజిక్కించుకుంది. మరో 3 స్థానాల్లో అధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ (113) ఎప్పుడో దాటేసిన కాంగ్రెస్ అధికార బీజేపీపై స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. ప్రస్తుతం బీజేపీ 64 స్థానాల్లో నెగ్గి, మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనతాదళ్ (ఎస్) 19 స్థానాల్లో గెలిచి, ఒక చోట ముందంజలో ఉంది. ఇతరులు 4 చోట్ల గెలిచారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ స్వయంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఆ పార్టీ 70 లోపు స్థానాలకే పరిమితమైంది. తమదే విజయం అని అతి విశ్వాసంతో ఉన్న బీజేపీ నేతలకు ఈ ఫలితాలు మింగుడుపడడంలేదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa