కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా కర్ణాటక షిగాన్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఒక అవాంఛనీయ సంఘటన గందరగోళానికి కారణమైంది. ఆఫీస్ లోని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయ ప్రాంగణంలో ఓ కోబ్రా కనిపించింది. బొమ్మై కార్యాలయానికి వచ్చిన కాసేపటికి కోబ్రాను గుర్తించిన కార్యకర్తలు, నాయకులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ పామును పట్టి, అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. ఈ పామును పట్టుకునే సమయంలో సీఎం బొమ్మై అక్కడే ఉన్నారు. కింగ్ కోబ్రా వల్ల ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa