కాకినాడ జిల్లాలో తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దిబ్బ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో మరణించిన వారందరూ మహిళలే. ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మహిళలు రొయ్యల పరిశ్రమలో పని చేసి ఆటోలో తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa