దివ్యాంగులకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వ సాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు 5 శాతం రిజర్వేషన్(సీట్లు) కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ప్రవేశాల్లో గరిష్ఠ వయోపరిమితిని ఐదేళ్లకు సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 40 శాతంపైగా వైకల్యం ఉన్న వారికే ఇవి వర్తించనున్నట్లు స్పష్టం చేసింది.