తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి పెందుర్తిలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి...’ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. కార్యక్రమానికి జనం పోటెత్తడంతో పెందుర్తి కిక్కిరిసిపోయింది. చంద్రబాబునాయుడు సుమారు 53 నిమిషాలు చేసిన ప్రసంగాన్ని ప్రజలంతా ఆసాంతం ఆలకించడంతో పాటు మధ్యమధ్యలో చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. కొద్దిరోజులుగా కొనసాగిన ఎండతీవ్రత బుధవారం సాయంత్రానికి చల్లబడడంతో సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.