తాడినాడలో ఒక యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కోరుకొల్లు దళితవాడకు చెందిన బిరుదుగడ్డ శేఖర్ (26) మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి పోతుమర్రు గొల్లగూడెంకు చెందిన ఒక వ్యక్తి మద్యం దుకాణం వద్దకు వెళ్లి శేఖర్‌ను బయటకు రమ్మని పిలిచి మెడపై కత్తితో నరికేశాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఎస్ఐ మణికుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.