ఝార్ఖండ్ లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీకి ఓ చిన్నారి బలయ్యాడు. రెంగ్రాహటు ప్రాంతంలోని బంగ్లాసాయ్ టోలాకు చెందిన బాలుడు గురువారం రాత్రి కెండు ఆకుల కోసం అడవిలోకి వెళ్లగా ఒక్కసారిగా ఐఈడీ పేలి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు తనకు తెలియకుండానే ఐఈడీపై కాలు పెట్టడంతో అది పేలిందని వెల్లడించారు. పోలీసులే లక్ష్యంగా దీన్ని మావోయిస్టులు పాతి పెట్టారని పేర్కొన్నారు.