ఎలాంటి వివక్షకు కానీ, అవినీతికి కానీ తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రజల ఇంటి ముంగిటకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్న ఉత్తమ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్ గ్రామ, వార్డు సచివాలయాలను వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఉత్తమ వాలంటీర్ల సత్కార్ సభలో ఆయన మాట్లాడుతూ. ఇందులో భాగంగా 15, 004 గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా 2. 66 లక్షల వాలంటీర్లను నియమించి, వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా అంకిత భావంతో పని చేస్తు విపత్కర పరిస్థితుల్లో, ప్రకృతి వైపరిత్యాలాలో మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలో వారి ప్రాణాలకు తెగించి పనిచేయడం గొప్ప విషయమన్నారు. ఎటువంటి చిన్న కష్టం ఎదురైనా గ్రామ స్థాయిలో మరియు వార్డు స్తాయిలో మొదట గుర్తుకొచ్చేది వాలేంటీరే అంటే అతిశయోక్తి కాదు. గత మూడేళ్ళ కాలం నుండి వాలేంటీర్లు చేస్తున్న పై సేవలను గుర్తించి వారిని మస్పూర్తిగా అభినందిoచాలనే సదుద్దేశ్యంతో ఈ సన్మాన కార్యక్రమం తలపెట్టామన్నరు. గత సంవత్సరం ఫిబ్రవరి నుండి నేటి జనవరి మాసం వరకు నిర్విఘ్నంగా పనిచేస్తూ, వారి పై ఎటువంటి పిర్యాదులు లేని వారిని ఈ వాలెంటీర్ల పురస్కారాలకు ఎంపిక చేయడం జరిగింది. ఇందులో సేవా వజ్ర , సేవా రత్నా మరియు సేవా మిత్రల ఎంపిక కొరకు వారి హాజరు శాతం, పించనుల పంపిణీ మరియు ఇతర సంక్షేమ పధకాల అమలులో కనబరిచిన ప్రతిబ మరియు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో వారు పోషించిన క్రియాశీలక పాత్ర మరియు వారి పరిదిలో గల 50 కుటంబాలలో లబ్దిదారుల సంతృప్తి స్థాయి సర్వే మొదలగు అంశాల ఆదారంగా వీరిని ఎంపిక చేయడం జరిగింది. సేవా వజ్రాలకు రూ. 30, 000/-లు చొప్పున, సేవా రత్నాలకు రూ. 20, 000/-లు చొప్పున సేవా మిత్రాలుకు రూ. 10, 000/-లు చొప్పున నగదు పురస్కారం ఇవ్వడం జరుగుతుందని అయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, శాసన సభ్యులు ఉన్నతాధికారులు పాల్గోన్నారు.