మొక్కకు 18 ధాతువులు అవసరము. మొక్కకు కావలసిన అన్ని ధాతువులు సమకూర్చుటకు సమగ్ర సస్య పోషణ యాజమాన్య పద్ధతులు పాటించాలి. వ్యవసాయ అధికారులు సూచించినట్లు పశువుల ఎరువు, నత్రజని, భాస్వరము, పొటాషియం కలిగిన కంప్లేకు ఎరువులు, జింకు స్లెపాటు ఆఖరు దుక్కిలోను మిగిలిన మోతాదు నతజని సిపార్సు మేరకు పైపాటుగా వేసి అధిక దిగుబడులు సాధించువచ్చు. అధిక మోతాదులో యూరియా మాత్రమే ఉపయోగిస్తే మొక్క ఏపుగా పెరిగి చీడ పీడలు ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి.