మొక్కలకు అతి తక్కువ పరిమాణంలో కావలసిన పోషకాలను సూక్ష్మపోషకాలు అంటారు. కాపర్, జింక్, ఇనుము, మాంగనీసు, మాలిబ్దినం వంటివి ఈ సూక్ష్మపోషకాలు. మామిడిలో ఈ పోషకాలు అవసరం. వీటిని సమపాలల్లో అందించాలి. కాయలు కోసిన వెంటనే జూన్`జూలై మాసాల్లో 15 రోజుల వ్యవధిలో 2 సార్లు లీటరు నీటికి 5 గ్రా. జింక్ సల్ఫేట్‌తో పాటు 10 గ్రా. యూరియాను, 0.1 మి.లీ. స్టికర్/వెట్టర్ కలిపి పిచికారి చేయడం వల్ల జింకు లోపాన్ని నివారించవచ్చు.