కష్టం విలువ నాకు తెలుసు ఎందుకంటే చిన్నప్పటినుండి నా తల్లిదండ్రులు కష్టం విలువ తెలిసేలా నన్ను పెంచారని కష్టపడి నా తల్లిదండ్రుల రెక్కలను ముక్కలు చేసుకుని నన్ను చదివించిన రోజులు మిమ్మల్ని చూస్తుంటే గుర్తుకొస్తున్నాయని పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు పేర్కొన్నారు. ఈ మేరకు ఉపాధి హామీ కూలీలతో కలిసి మండుటెండలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి వారికి ఏం అవసరం అడగ్గా వారు మాకు టెంట్లు ఏర్పాటు చేయాలి, ప్రమాదం జరిగితే వెంటనే స్పందించే మెడికల్ కిట్లను ఏర్పాటు చేయాలి అలాగే మంచినీళ్లు ఏర్పాటు చేసి మాకు కూలీ పెంచాలని శాసనసభ్యులు గొల్ల బాబురావుకు తెలుపుగా ఆయన స్పందించి పంచాయతీరాజ్ కమిషనర్ తో మాట్లాడి కూలి 600 చేయాలని తక్షణమే టెంట్లు, ప్రధమ చికిత్స చేసే ఆసుపత్రి సిబ్బందిని మంచినీళ్లు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కూలీలంతా మళ్లీ జగనే మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే గొల్ల అంటూ నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆనంద సంతోషాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులమతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకుంటే కొంతమంది కెట్టన వారు విమర్శలు గుప్పిస్తున్నారని వారు ఎంత విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డికి అన్ని దీవెనలని మళ్లీ ఈ రాష్ట్రాన్ని ఏలేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.