వలంటీరు వ్యవస్థపై విమర్శలు చేసిన విపక్ష నేత చంద్రబాబే తాము అధికారంలోకి వచ్చాక ఇదే వ్యవస్థను కొనసాగిస్తామని అంటున్నారని, గతంలో ఈ వ్యవస్థను తిట్టిన నోళ్లే ఇవాళ పొగుడుతున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. స్థానిక బాపూజీ కళా మందిరంలో వలంటీరుకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. గతంలో వలంటీరు వ్యవస్థపై విమర్శలు చేసిన విపక్ష నేత చంద్రబాబే తాము అధికారంలోకి వచ్చాక ఇదే వ్యవస్థను కొనసాగిస్తామని అంటున్నారు. అదేవిధంగా గతంలో ఈ వ్యవస్థను తిట్టిన నోళ్లే ఇవాళ పొగుడుతున్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక నిజాయితీతో రూపుదిద్దుకున్న వ్యవస్థ వలంటీరు వ్యవస్థ. ఇక్కడ పనిచేస్తున్న వారంతా ఎంతో సేవాభావంతో ఉన్నారు. విపక్షాల విమర్శలు పట్టించుకోక ప్రజా సేవ చేస్తున్న వలంటీర్లను అభినందిస్తూ ఉన్నాను అని ధర్మాన తెలిపారు.