ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ బహిరంగ సవాల్ విసిరారు. విస్సన్నపేట పట్టణంలో 609 ఎకరాల భూమిని కాజేసినట్టుగా చంద్రబాబు చేసిన విమర్శలపై ఆయన మండిపడ్డారు. 609 ఎకరాల్లో ఒక సెంటు భూమి అమర్నాథ్ పేరు మీద కానీ, తన కుటుంబ సభ్యుల పేరిట కానీ ఉన్నా.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. చంద్రబాబు నిరూపించకపోతే లోకేశ్‌ను రాజకీయాలు నుంచి తప్పిస్తారా? అంటూ సవాల్ విసిరారు.