చంద్రబాబు తన హయాంలో ఎక్కడ భూమి ఇచ్చాడో చెప్పాలి.. ఒక సెంటు ఇచ్చినా చూపించమని అడుగుతున్నాం.. చూపిస్తే స్వయంగా క్షమాపణ చెబుతామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆర్ 5 జోన్ లే అవుట్ లలో పర్యటించారు.. నవులూరు, కృష్ణాయపాలెంలో లేఅవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. అమరావతి ప్రాంతంలో లే అవుట్ల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.. ప్రైవేటు లే అవుట్లు కూడా ఇంత చక్కగా ఉండవని ప్రశసించారు.. లేఅవుట్లలో 62 శాతం రోడ్లు, ఓపెన్ స్పేస్ గా వదిలాం.. ఇంటర్నల్ రోడ్ల కోసం 36 శాతం భూమి కేటాయించామని.. స్లమ్స్ అని ఎలా అంటారు? అని నిలదీశారు.. మొత్తం స్థలంలో 38 శాతం మాత్రమే ప్లాటింగ్ చేశాం అని వెల్లడించారు.