ప్రజలకు మంచి నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరించే విధానమే క్లీన్ నోట్ పాలసీ. ఇందులో భాగంగానే RBI రూ.2 వేలనోటును తాజాగా చలామణిలో నుంచి నిలిపివేసింది. 2016 నోట్లు రద్దు తరువాత రూ.2 వేల నోటును తీసుకొచ్చింది ఆర్బీఐ. అయితే ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత, 2018-19లో 2,000 నోట్ల ముద్రణ నిలిపివేసినట్టు ఆర్బీఐ పేర్కొంది.