‘‘ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్లే. మనందరి ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే.. నవరత్నాల ఫిలాసఫీ నచ్చి, జగనన్నకు తోడుగా ఉండేందుకు పేద ప్రజలకు సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 2.66 లక్షల మహాసైన్యమే వాలంటీర్ వ్యవస్థ’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారధులు నా వాలంటీర్లే అని చెప్పడానికి గర్వపడుతున్నానని సీఎం చెప్పారు. వివక్ష చోటులేకుండా, లంచాలు తావులేకుండా మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన తులసి మొక్కలాంటి వ్యవస్థే వాలంటీర్ల వ్యవస్థ. ఈ వ్యవస్థ ప్రజలకు ఎంతగా మేలు చేస్తుందో వివరించే నైతికత కూడా కేవలం వాలంటీర్ల సొంతమన్నారు.