చేపల పెంపకంలో అధిక దిగుబడి రావాలంటే చేప పిల్లల ఎంపిక, నీటి నాణ్యత, ఎరువులు, మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి. చేపపిల్లల ఎంపికలో ఒక దానితో ఒకటి పోటీపడని కనీసం 3 రకాల చేప పిల్లలను 2 మీటర్ల లోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి. 2-4 అంగుళాల సైజు కలిగి చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న చేప పిల్లల్ని ఎంచుకోవాలి. దాణా పెట్టే ప్రత్యేక చెరువుల్లో ఎకరాకు 3 వేల పిల్లల్ని వేసుకోవచ్చు. నాచు ఎక్కువగా పెరిగే చెరువుల్లో ఎకరాకు 100-150 గడ్డి చేపపిల్లల్ని వేసుకోవడం మంచిది.