పొన్నూరు పట్టణంలోని17 సచివాలయాల పరిధిలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎన్. రాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ కార్డు అప్డేట్ 2010 నుండి 16వ సంవత్సరంలోపు తీసుకున్న వారు తప్పనిసరిగా ఆధార కార్డులు రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా ఆమె సూచించారు. ఆధార్ కార్డు పేర్లు మార్పులు, చేర్పులు తప్పులు సరి చేసుకొనుట తదితర సేవలను పొన్నూరు పురపాలక సంఘం ప్రజలు తప్పనిసరిగగా వినియోగించుకోవాలని ఆమె కోరారు.