తెనాలి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం రాత్రి పెదరావూరు వద్ద వాహనాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ వాహనదారులు తప్పక హెల్మెంట్ ధరించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కాగితాలు కలిగి ఉండాలన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు పెండింగ్ లో ఉన్న చలనాలను వెంటనే చెల్లించాలని సూచించారు. తనిఖీల్లో భాగంగా జగ్గడగుంట పాలెం, గ్రామ శివారు చిన్నపరిమి డొంక రోడ్డు వెంబడి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను, ఎస్ఐ వెంకటేశ్వర్లు అదుపులోనికి తీసుకొని వారిపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నందుకు వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. వారిని కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఇలాంటి చేష్టలకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామన్నారు.