గంగాధర నెల్లూరు మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు క్వారీలో ఆదివారం గుర్తుతెలియని యువకుడు మృతి చెందడంపై ఆదివారం సాయంత్రం సస్పెన్స్ వీడింది. స్థానిక ఎస్ఐ రామాంజనేయులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు నగరం, గిరింపేటలోని పగడమాను వీధికి చెందిన రాజేంద్రన్ కుమారుడు చంద్రశేఖర్ గా గుర్తించినట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం జీడి నెల్లూరు సమీపంలోని క్వారీ వద్ద మద్యం సేవించిన అనంతరం ఈతకు వెళ్లి మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.