చిత్తూరు కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుందని డీఆర్వో రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10. 30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టర్, ఇతర అధికారులు అందుబాటులో ఉండి వినతిపత్రాలను స్వీకరిస్తారని తెలిపారు. సమస్యలపై నేరుగా స్పందన కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.