చిత్తూరు పాత జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతిప త్రాలను స్వీకరిస్తామన్నారు. పోలీస్ శాఖ నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న వారు, పోలీసుల నుంచి న్యాయం కావాలనుకునే వారు నేరుగా వచ్చి సమస్యలను చెప్పవచ్చన్నారు.