ఎస్. ఆర్. పురం మండలం , తయ్యూరు పా యకట్టు అంకన్నపల్లిలో ఉన్న ధర్మరాజుల గుడి మహాభారతం ఉత్సవా ల్లో భాగంగా ఆదివారం వైభవంగా అర్జున తపస్సు నిర్వహించారు. ఉభయదారులుగా బసివి రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రరెడ్డి, కు టుంబ సభ్యులు వ్యవహరించారు. ద్రౌపది అమ్మవారికి ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త లింగారెడ్డి, కమిటీ సభ్యులు రామనాథ రెడ్డి, లోకనాథ రెడ్డి, దామోదరాచారి, జగన్నాథనాయుడు, కుమ్మర పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.