గంగాధరనెల్లూరు మండలంలోని గరిగలపల్లె వెంకటాపురం గ్రామంలో దుర్యోధనవధ కార్యక్రమాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ధర్మకర్తలు జె. రాజేంద్రనాయుడు, టి. నాగరాజులు నాయుడు ఆధ్వర్యంలో మహాభారత యజ్ఞంలో భాగంగా 19 వరోజు ఉదయం ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు.
అనంతరం దుర్యోధనుడు పాత్రధారి దొరస్వామి ఖడ్గం చేతపట్టి, భీముడు పాత్రధారి సత్యగధను చేతపట్టి ఒకరికొకరు పోటీపడి పద్యాలను పాడుతూ తలపడే విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. దుర్యోధనుని వధతో ఆ ఘట్టం ముగిసింది. దీనిని వీక్షించడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు.