అనారోగ్య కారణాలతో వ్యక్తి ఉరివే సుకుని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన తవనంపల్లి మండలంలోని పొన్నే డుపల్లెలో ఆదివారం జరిగింది. స్థానిక పోలీసుల కథనం మేరకు. పొన్నేడుపల్లె గ్రామానికి చెందిన డి. శంకర్ కుమారుడు అమరనాథ్(37) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో అమరనాథ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.