వైసీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధుల్లో చాలా మంది నేరచరితులేనని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై మొత్తం 408 క్రిమినల్ కేసులు ఉన్నాయని అన్నారు. ఏపీ సీఎం జగన్ పై 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయని, మొత్తం 31 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ న్యాయ కార్యకలాపాల ఖర్చులు 70 శాతం పెరిగాయని పేర్కొన్నారు.