జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదలయ్యాయి. జనవరి- మార్చి 2023 త్రైమాసికానికి గాను మొత్తం 9.95 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఇప్పటివరకు జగనన్న విద్యాదీవెన పథకం కింద 26 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 10,636 కోట్ల జమచేశామని సీఎం జగన్ తెలిపారు.