చదువుతోనే పేదరికాన్ని రూపుమాపవచ్చని సీఎం జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సభలో సీఎం మాట్లాడుతూ పేదలకు పెద్ద చదువులు అందాలని, అందుకే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వ బకాయిలను రూ. 1700 కోట్లు చెల్లించామని తెలిపారు. 'పిల్లలు మీరు చదవండి అండగా నేనుంటా' అని సీఎం జగన్ ప్రకటించారు.