సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 26వ తేదీన తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో 50వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఆయన ప్రసంగించే సభ వేదిక ప్రాంతాన్ని వైసీపీ నేతలు బుధవారం సాయంత్రం పరిశీలించారు. రాష్ట్ర మంత్రి విడుదల రజిని, ముఖ్యమంత్రి కార్యక్రమాల చైర్మన్ తలశిల రఘురామిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, తాడికొండ సమన్వయకర్త కత్తెర సురేష్ ఉన్నారు.