నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని విపక్షాలు బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ఇలాంటి విషయాల్లో ఆస్ట్రేలియా విపక్ష నేతలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ‘సిడ్నీలో కమ్యూనిటీ ఈవెంట్ జరిగింది. ప్రధాని అల్బనీస్‌తో పాటు విపక్ష నేతలు కూడా హాజరయ్యారు. వారికి దేశం ముఖ్యం. ఒక కమ్యూనిటీ ఈవెంట్‌కు వచ్చి వారంతా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు’ అని పేర్కొన్నారు.